కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. మాధవరం చేసిన అవినీతి అక్రమాలపై ఆధారాలతో సమాధానం చెబుతానన్నారు. రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు కవిత. జాగృతి జనం బాటలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన కవిత.. మాధవరం కృష్టారావు మాటల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తుందన్నారు. ఆయన 15 సంవత్సరాలుగా చేసిందే తాను చెప్పానన్నారు కవిత.
మాధవరం వ్యక్తిగత ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు కవిత. టీఆర్ఎస్ లో తనను నిజామాబాద్ వరకే పరిమితం చేశారని చెప్పారు. ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలుగా జనం బాటలో భాగంగా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నానని అన్నారు.
కవిత కుక్క పేరు కూడా విస్కీనే: మాధవరం
ఢిల్లీలో లిక్కర్ కేసుతో కవిత రాష్ట్ర పరువు తీసిందని, కనీసం అత్తగారి ఊరిలో కూడా గెలవలేకపోయిన ఆమెకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిసిన తనను విమర్శించే నైతికత లేదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. డిసెంబర్ 8న కూకట్‌పల్లి నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి జనంబాటలో భాగంగా కవిత.. కృష్ణారావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన కబ్జాదారుడని కామెంట్ చేయగా.. కృష్ణారావు ఖండించారు. మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ కవిత తన ఇంట్లో కుక్కకు కూడా విస్కీ అని పేరు పెట్టుకున్నారని, లిక్కర్‌స్కామ్‌తో చరిత్రహీనురాలిగా మిగిలిపోయారన్నారు.
►ALSO READ | హైదరాబాద్ మీర్ పేటలో పల్టీలు కొట్టిన కారు..
తనపై ఇప్పటివరకూ ఎన్నో కుక్కలు మొరిగి పోయాయని కవితనుద్దేశించి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి.. కేటీఆర్, హరీశ్‌ను జైలుకు పంపాలని కవిత చేస్తున్న కుట్రలు తమకు తెలుసని, ఆమె చరిత్ర బయటపెడితే తట్టుకోలేదని అన్నారు. ‘‘కేసీఆర్ పేరు చెప్పుకొని కూకట్‌పల్లిలో ఓవర్‌ల్యాప్ ల్యాండ్ క్లియర్ చేసుకున్నవ్.. నిత్యం దోచుకు తినాలనే ధ్యాస తప్ప ప్రజల గురించి ఆలోచించే ఉద్దేశం లేదు. పెద్దాయన మీద గౌరవంతో ఊరుకుంటున్నం. ఇకపై నాపై కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన కానీ అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదు” అని హెచ్చరించారు. తన కార్యాలయంలో ఉన్న కవిత ఫ్లెక్సీని తొలగించారు.

