
జగిత్యాల జిల్లా యువకులు తయారు చేసిన మన మెట్పల్లి యాప్ ను జూన్ 25న కలెక్టర్ సత్యప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకుల ప్రయత్నాన్ని ప్రశంచారు కలెక్టర్, ఎమ్మెల్యే. బస్ టైంలు, షాపులు, ఆర్డర్లు, టౌన్ మ్యాప్, ప్రభుత్వ కార్యాలయాల సమాచారం, అప్డేట్లు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు యువకులు. ఈ యాప్ను మెట్పల్లికి చెందిన గంగుల శ్రీ సాయి మాధవ్, రెగుంట శరత్, కోయల్కర్ అజయ్ కుమార్, రాజోజి జయదీప్, చెర్లపల్లి యువరాజ్ అనే యువకులు తయారు చేశారు.
ఎవరికైనా స్థానిక సమాచారం తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది. మెట్ పల్లి పూర్తి సమాచారం అంటే మెట్ పల్లి నుంచి బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ టైంలో ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల టైమింగ్స్ తో పాటు పూర్తి సమాచారం యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని తెలుసుకోవచ్చు. మెట్ పల్లి టౌన్ కు సంబంధించిన మ్యాప్, ఇతర సమాచారం కూడా యాప్ లో తెలుసుకోవచ్చు. ఒకే యాప్ లో అన్ని వివరాలు త్వరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి... వెంటనే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని తెలుసుకోవాలని యువకులు కోరుతున్నారు.
►ALSO READ | CBSE కీలక నిర్ణయం:10వ తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు..2026 నుంచి అమలు