ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12: దబాంగ్ ఢిల్లీ, పింక్ పాంథర్స్ శుభారంభం

 ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12:  దబాంగ్ ఢిల్లీ,  పింక్ పాంథర్స్ శుభారంభం

వైజాగ్‌‌:  ప్రో కబడ్డీ లీగ్ 12 సీజన్‌‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ,  జైపూర్ పింక్ పాంథర్స్ శుభారంభం చేశాయి.  వైజాగ్‌‌లోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌‌లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌లో దబాంగ్ ఢిల్లీ  41–34 తో బెంగళూరు బుల్స్‌‌పై విజయం సాధించింది. ఢిల్లీ  జట్టును కెప్టెన్ ఆషు మాలిక్ (15 పాయింట్లు) అద్భుత రైడింగ్‌‌తో ముందుండి నడిపించాడు. నీరజ్ నర్వాల్ (7 పాయింట్లు)  కూడా సత్తా చాటాడు. 

 బెంగళూరు తరఫున ఆల్‌‌రౌండర్ అలీరెజా (10) సూపర్ టెన్‌‌, రైడర్ ఆశీష్​ మాలిక్​ (8)  పోరాడినా ఫలితం లేకపోయింది. మరో మ్యాచ్‌‌లో జైపూర్   39–36తో పట్నా పైరేట్స్‌‌ను ఓడించింది. పాంథర్స్​ రైడర్లు నితిన్ కుమార్ (13) , అలీ (8) ఆకట్టుకున్నాడు. స్టార్ రైడర్ మణిందర్ సింగ్ (15) పోరాడినా పైరేట్స్‌‌ కు ఓటమి తప్పలేదు.  బుధవారం  జరిగే  మ్యాచ్‌‌ల్లో పుణెరి పల్టాన్‌‌తో బెంగాల్ వారియర్స్,  హర్యానా స్టీలర్స్‌‌తో యు ముంబా  పోటీ పడతాయి.