ప్రాగ్: ఇండియా గ్రాండ్‌మాస్టర్ అరవింద్ చిదంబరం ప్రాగ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ ఆరో రౌండ్‌లో వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్‌ను ఓడించాడు. అరవింద్ సిసిలియన్ డిఫెన్స్ ఎంచుకోగా, ఆట మధ్యలో గుకేశ్ తీవ్రమైన ఒత్తిడికి లోనై 40వ ఎత్తు వద్ద పెద్ద పొరపాటు చేశాడు.
ఆపై ఎనిమిది ఎత్తుల తర్వాత ఓటమి అంగీకరించి ఆఖరి స్థానానికి పడిపోయాడు. చాలెంజర్స్ విభాగంలో దివ్య దేశ్‌ముఖ్, సూర్య శేఖర్ తమ గేమ్స్‌ను డ్రాగా ముగించారు.
