ఎంఐఎం, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నై: జైరామ్ రమేశ్

ఎంఐఎం, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నై: జైరామ్ రమేశ్

టీఆర్ఎస్ పార్టీ.. గ్లోబల్ రాష్ట్ర సమితిగా మారినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్ జోడో యాత్ర బెంగాల్, అసోం, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సాయంత్రం నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ సభకు పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే హాజరవుతారని జైరామ్ రమేశ్ చెప్పారు.

రాష్ట్రంలో ఎంఐఎం, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని జైరామ్ రమేశ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా దూరంగా ఉంటుందని ఆయన చెప్పారు. గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అని అభిప్రాయపడ్డారు. షాకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.