పాక్ జర్నలిస్ట్​కు జైశంకర్ స్ట్రాంగ్​ కౌంటర్

పాక్ జర్నలిస్ట్​కు జైశంకర్ స్ట్రాంగ్​ కౌంటర్

యునైటెడ్​ నేషన్స్: దక్షిణాసియా దేశాలు ఇంకెంత కాలం టెర్రర్​ ముప్పును ఎదుర్కోవాలని ప్రశ్నించిన పాకిస్తాన్​ జర్నలిస్టుకు మన విదేశాంగ మంత్రి జైశంకర్​ దిమ్మతిరిగే కౌంటర్​ ఇచ్చారు. యూఎన్​లో మన దేశం అధ్యక్షతన జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పాక్​ జర్నలిస్టు ప్రశ్నకు.. ‘‘మీరు సరైన మంత్రిని ప్రశ్నించలేదు. ఈ క్వొశ్చన్​ మీ మంత్రిని అడగాలి. టెర్రరిజాన్ని ఎన్ని రోజులు పెంచి పోషించాలనుకుంటున్నదో పాక్​ మంత్రులకే తెలుసు”అని జైశంకర్​ జవాబిచ్చారు. టెర్రరిజం అంటేనే ఎవరు గుర్తుకొస్తారో ప్రపంచ దేశాలన్నింటికీ తెలుసు అని విమర్శించారు. ఇప్పటికైనా టెర్రరిజాన్ని క్లీన్ చేసి.. ఓ మంచి పొరుగు దేశంగా ఉండాలని సలహా ఇచ్చారు. ప్రపంచ దేశాలు తమ తమ దేశాల ఆర్థికాభివృద్ధి, డెవలప్​ మెంట్, ప్రోగ్రెస్​పైన దృష్టి పెడుతున్నాయని, వాటిని అనుసరించాలని పాకిస్తాన్​ కు మంత్రి హితవు పలికారు.