బాధ్యతాయుతమైన దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు

బాధ్యతాయుతమైన దేశాలతో భారత్‌కు సత్సంబంధాలు

మధ్య ఆసియాలోని బాధ్యతాయుతమైన అన్ని దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయన్నారు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. ఆఫ్గనిస్తాన్ తోనూ మంచి రిలేషన్స్ ఉన్నాయని చెప్పారు. అక్కడ మహిళలు, పిల్లల హక్కులు పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, డ్రగ్స్ అక్రమరవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు తమ సహకారం ఉంటుందన్నారు. ఢిల్లీలో జరిగిన భారత్-దక్షిణాసియా దేశాల మూడో సదస్సులో ఆయన మాట్లాడారు. అంతకుముందు పలు దేశాల మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు జైశంకర్. ప్రపంచమంతా కరోనా క్రైసిస్‌లో అల్లాడుతున్న సమయంలో భారత్ దాదాపు 90 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసి ఆదుకుందని ఆయన గర్తు చేశారు. అంతా కలిసి పని చేస్తే ఈ మహమ్మారిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అన్నారు.