ఇక వీళ్లు మారరు: జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం.. బీఎస్ఎఫ్​ కాల్పుల్లో ఏడుగురు టెర్రరిస్టులు హతం

ఇక వీళ్లు మారరు:  జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం..  బీఎస్ఎఫ్​ కాల్పుల్లో ఏడుగురు టెర్రరిస్టులు హతం

 పహల్గాంలో  ఉగ్రవాదులు దాడి చేసిన తరువాత భారత్​... పాకిస్తాన్​ మధ్య ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి.  మిస్సైల్స్​ అటాక్​.. ఎయిర్​ఫోర్స్​. నేవీ. ఆర్మీ  బలగాలు అప్రమత్తమయ్యాయి.  పాక్​ ఉగ్రవాద శిబిరాలను భారత్​ ధ్వంసం చేసిన తరువాత పరిస్థితి మరీ తీవ్రరూపం దాల్చింది.  పాకిస్తాన్​ డ్రోన్లను ప్రయోగిస్తుండగా.. భారత్​ వాటిని ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తూ ఇండియా పై చేయి సాధిస్తుంది. 

డైరక్ట్​గా తలపడలేని పాకిస్తాన్​ మళ్లీ ఉగ్రవాదులతో అలజడి సృష్టించేందుకు టెర్రరిస్ట్​ సంస్థ జైషే మహమ్మద్​ అనుచరులు భారత్​లోకి ప్రవేశించి అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారు. జమ్మూకాశ్మీర్​లోని సాంబా సెక్టార్​లోని భారత్​.. పాకిస్తాన్​ సరిహద్దులో భారత్​లోకి ఏడుగురు జైషే మహమ్మద్​ ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. ఎల్​ఓసీ నుంచి భారత్​ లోకి చొరపడేందుకు ప్రయత్నించిన జూషే మహమ్మద్​ ఉగ్రవాదులను భారత్​ కు చెందిన బీఎస్​ఎఫ్​ బలగాలు గుర్తించి..  వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు.  వారు కాల్పులకు సిద్దపడుతుండగా.. ఈ లోపే బీఎస్ఎఫ్​ బలగాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరపగా వారు మరణించారు.