సమగ్ర కుటుంబ సర్వేలో రాజకీయ పార్టీలూ భాగస్వామ్యం కావాలి: జాజుల శ్రీనివాస్​ గౌడ్

సమగ్ర కుటుంబ సర్వేలో రాజకీయ పార్టీలూ భాగస్వామ్యం కావాలి: జాజుల శ్రీనివాస్​ గౌడ్

ఖైరతాబాద్, వెలుగు:సమగ్ర కుటుంబ సర్వేలో ఉద్యోగులతోపాటు రాజకీయ పార్టీలు కూడా భాగస్వామ్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​అన్నారు. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేపై బీఆర్ఎస్, బీజేపీ రెండు రోజుల్లో తమ వైఖరిని ప్రక టించాలన్నారు. లేదంటే తెలంగాణలో ఆ పార్టీలకు ఇక మనుగడ ఉండదని చెప్పారు. 

అలంపూర్​ నుంచి ఆదిలాబాద్​ వరకు యాత్ర

‘ఓబీసీ మేలుకో’ అంటూ 33 జిల్లాల్లోని 119 నియోజకవర్గాల్లో  నవంబరు 6 నుంచి 15 రోజులపాటు సామాజిక కులగణన యాత్ర నిర్వహిస్తున్నట్టు శ్రీనివాస్ గౌడ్ తెలిపా రు. అలంపూర్​ నుంచి ఆదిలాబాద్​ వరకు యాత్ర జరుగుతుందన్నారు.

 136 బీసీ కుల సంఘాల  ప్రతినిధులతో 3వ తేదీన హైదరాబాద్​లో  సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బీసీ కులగణన ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధికార ప్రతినిధిగా తీగల ప్రదీప్ గౌడ్​కు నియామక పత్రం అందజేశారు.