టైటానిక్ షిప్ మునిగిపోయిన చోట ఏదో శక్తి ఉందని.. ఆ ప్రాంతంలో మిస్ అయితే దొరకరు అని.. తాను ముప్పైమూడు సార్లు వెళ్లొచ్చినా.. ఇప్పటికీ భయంగా ఉంటుంది అంటున్నారు టైటానిక్ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరూన్. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. టైటానిక్ షిప్ అంటే ఏంటీ.. దాని విశేషాలను అతి సామాన్యులకు కూడా తెలియజేసిన వ్యక్తి జేమ్స్. ప్రస్తుతం టైటానిక్ షిప్ చూడటానికి వెళ్లిన టైటాన్ సబ్ మెరైన్ అదృశ్యం కావటం.. అందులోని ఐదుగురు వ్యక్తులు చనిపోవటంపై జూన్ 22న ఆయన స్పందించారు.
టైటాన్ సబ్ మెరైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇప్పటి వరకు 33 సార్లు ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చానని.. అక్కడ సముద్రం 13 వేల అడుగుల లోతు ఉంటుందని.. సబ్ మెరైన్ లో ఎంతో భారం పడుతుందని.. అక్కడ ఏ మాత్రం సబ్ మెరైన్ కంట్రోల్ తప్పినా.. ఆచూకీ దొరకటం అసాధ్యం అన్నారు జేమ్స్. టైటాన్ సబ్ మెరైన్ అదృశ్యం, అందులోని ఐదుగురు చనిపోయినట్లు అమెరికా రక్షణ దళ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. ఓడ మునిగిపోయిన ప్రాంతాన్ని చూడాలనే ఆకాంక్షతోనే టైటానిక్ సినిమాను తీసినట్లు చెప్పారు. అంతేకానీ, ప్రత్యేకంగా దానిని ఒక సినిమాగా తీయాలనే ఉద్దేశ్యం మొదట్లో తనకు లేదన్నారు. మునిగిపోయిన టైటానిక్ ను చూడాలనే సముద్రగర్భంలో సబ్ మెరైన్ లో ప్రయాణించినట్లు చెప్పారు.
అద్భుతం అంటూనే..
టైటానిక్ షిప్ అనేది ఓ అద్భుతం అని.. దాన్ని చూడటం అనేది కూడా మహా అద్భుతం అంటూనే.. ఇది సాహసంతో కూడిన ప్రయాణం అన్నారు జేమ్స్. టైటానిక్ షిప్ దగ్గర ఏదో తెలియని శక్తి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన.. ఆ ప్రాంతంలో మిస్ అయితే దొరకటం కష్టం అని ముందే ఊహించానని తన గత అనుభవాలే దీనికి నిదర్శనం అన్నారాయన. జేమ్స్ కామెరూన్ టైటానిక్, అవతార్, అవతార్– 2 తదితర సెన్సేషనల్ హాలీవుడ్ చిత్రాలకు దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న అవతార్– 3 2024 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
