ఛెత్రి లేకపోయినా అతనికి తలుపులు తెరిచే ఉన్నాయ్: కోచ్‌‌‌‌‌‌‌‌ ఖలీద్‌‌‌‌‌‌‌‌ జమిల్‌‌‌‌‌‌‌‌

ఛెత్రి లేకపోయినా అతనికి తలుపులు తెరిచే ఉన్నాయ్:  కోచ్‌‌‌‌‌‌‌‌ ఖలీద్‌‌‌‌‌‌‌‌ జమిల్‌‌‌‌‌‌‌‌

బెంగళూరు: స్టార్‌‌‌‌‌‌‌‌ స్ట్రయికర్‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌ ఛెత్రిని.. సీఏఎఫ్‌‌‌‌‌‌‌‌ఏ నేషన్స్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ జాతీయ శిబిరం నుంచి తొలగించడంపై ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ కొత్త కోచ్‌‌‌‌‌‌‌‌ ఖలీద్‌‌‌‌‌‌‌‌ జమిల్‌‌‌‌‌‌‌‌ ఆదివారం వివరణ ఇచ్చాడు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో జరిగే కీలకమైన ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయింగ్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు ముందు ఇది సన్నాహక టోర్నీ మాత్రమేనని స్పష్టం చేశాడు. ఈ క్యాంప్‌‌‌‌‌‌‌‌లో ఛెత్రి లేకపోయినా అతనికి తలుపులు తెరిచే ఉన్నాయని చెప్పాడు. తజకిస్తాన్‌‌‌‌‌‌‌‌, ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో జరిగే సీఏఎఫ్‌‌‌‌‌‌‌‌ఏ నేషన్స్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ కోసం శుక్రవారం 35 మందితో కూడిన ప్రాబబల్స్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు. ఇందులో ఛెత్రి పేరు లేకపోవడంతో విమర్శలు చెలరేగాయి. అయితే అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 9, 14న సింగపూర్‌‌‌‌‌‌‌‌తో జరిగే ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయింగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఛెత్రి బరిలోకి దిగే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని జమిల్‌‌‌‌‌‌‌‌ తెలిపాడు. ‘ఇది సన్నాహక శిబిరం మాత్రమే. అందుకే ఛెత్రి ఇందులో లేడు. ఈ విండోలో కొంత మంది ప్లేయర్లను పరిశీలించాలని భావిస్తున్నాం. నేను అతనితో దీని గురించి మాట్లాడా. ఛెత్రి జట్టులో ఉండటం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. అతని కోసం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. 

ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌లో ఛెత్రి ఓ లెజెండ్‌‌‌‌‌‌‌‌. నేను అతనితో కలిసి ఆడా. చాలా సందర్భాల్లో అతని ఆట చూశా. నాకు ఇష్టమైన ప్లేయర్లలో అతనూ ఒకడు. ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌కు ఛెత్రి ఒక రోల్‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌’ అని ఆలిండియా ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ (ఏఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌) విడుదల చేసిన ఓ ప్రకటనలో జమిల్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. సీఏఎఫ్‌‌‌‌‌‌‌‌ఏ నేషన్స్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో ఉంది. ఈ నెల 29న తజకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 1న ఇరాన్‌‌‌‌‌‌‌‌తో, 4న అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో తలపడుతుంది. మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌ కోసం, ఫైనల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 8న హిసోర్‌‌‌‌‌‌‌‌, తాష్కెంట్‌‌‌‌‌‌‌‌లో జరుగుతాయి. దీనికోసం 22 మంది ప్లేయర్లతో శనివారం నేషనల్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టారు. మిగిలిన 13 మంది డ్యూరాండ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటున్నారు. తొందరల్లోనే వాళ్లు జట్టులో కలవనున్నారు. 

రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ను పక్కనబెట్టి..

వాస్తవానికి 41 ఏళ్ల ఛెత్రి.. గతేడాది జూన్‌‌‌‌‌‌‌‌లో కువైట్‌‌‌‌‌‌‌‌తో ఆడిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పాడు. కానీ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌ థర్డ్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో టీమిండియాకు సాయం చేయాలని మాజీ కోచ్‌‌‌‌‌‌‌‌ మార్వ్వెజ్‌‌‌‌‌‌‌‌ చేసిన అభ్యర్తన మేరకు ఈ ఏడాది మార్చిలో మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్నించి నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన ఛెత్రి ఒక గోల్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దాంతో ఇండియా 3–0తో మాల్దీవ్స్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకున్న ఇండియా.. హాకాంగ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 0–1తో ఓడింది. దీంతో 2027లో జరిగే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించడం కష్టంగా మారింది.