
జమ్మూకశ్మీర్ లో ఓ వైపు భద్రతాపరమైన టెన్షన్ నడుస్తోంటే.. మరోవైపు పొలిటికల్ టెన్షన్ మొదలైంది. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి.. యాంటీ కరెప్షన్ బ్యూరో అధికారులు లెటర్ రాశారు. జమ్మూకశ్మీర్ బ్యాంక్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని.. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ముఫ్తీ సీఎంగా ఉన్న టైంలో.. కొందరు మంత్రుల సిఫారసులతో ఉద్యోగుల నియామకాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఏసీబీ.. ఎంక్వైరీ మొదలుపెట్టింది. మరోవైపు.. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. మనీలాండరింగ్, క్రికెట్ బోర్డు నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఆయనను ప్రశ్నించారు.