వైరల్: పోలీస్ నోట కరోనా పాట

వైరల్: పోలీస్ నోట కరోనా పాట

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ ప్రపంచాన్నిఎంతగా భయపెడుతోందో తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాతో జాగ్రత్తగా ఉండాలని చాలా మంది రచయితలు, కళాకారులు, నటులు సందేశం ఇస్తున్నారు. పాటలు, కవితలు, పెయింటింగ్స్, శాండ్ ఆర్ట్స్ రూపంలో ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. ఈ కోవలోనే తాజాగా జమ్మూ కశ్మీర్ కు చెందిన ఓ పోలీసు కూడా కరోనాపై పాట రూపంలో తన మెసేజ్ ను ప్రజలకు చెప్పే యత్నం చేశాడు. దీనికి సోషల్ మీడియాలో చాలా బాగా అప్లాజ్ రావడం విశేషం. ప్రజలు ఇళ్ల మద్దే సురక్షితంగా ఉండాల్సిందిగా ఈ పాట ద్వారా సోహన్ రఘువంశీ అనే పోలీసు కోరాడు. ఒకవేళ ప్రజలు అత్యవసరంగా బయటకు వెళ్లినా.. మాస్క్ కట్టుకోవడం మర్చిపోవద్దని, కరోనా చాలా ప్రమాదకరమైందని పాటలో పేర్కొన్నాడు.

హిందీ భాషలో పాడిన ఈ పాటలో వైరస్ గురించిన పలు విషయాలను సోహన్ పంచుకున్నాడు. ‘ఈ వైరస్ మీ ప్రాణాలు కావాలని కోరుతుంది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లకండి మిత్రులారా.. శానిటైజర్ తో చేతులను కడుక్కోండి. మొహంపై మాస్క్ కచ్చితంగా కట్టుకోండి. లక్షణ రేఖను గౌరవించండి. కరోనా చాలా ప్రమాదకరమైంది. ఈ విషయం తెలుసుకోండి. ఈ వైరస్ మీ ప్రాణాలను అడుగుతోంది మిత్రులారా’ అని సోహన్ రాశాడు.