జమ్మూ కాశ్మీర్ లోయల్లో భారీగా మంచు కురిసింది. ఇళ్లు, చెట్లు, రోడ్లు అన్నీ మంచుతో కప్పిపోయాయి. దింతో కాశ్మీర్ ఒక అందమైన మంచు లోకంలా మారిపోయి, శీతాకాలపు సుందరమైన దృశ్యాన్ని సృష్టిస్తోంది.
పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్, సోనామార్గ్, పహల్గామ్‌లలో భారీగా మంచు కురిసింది. శ్రీనగర్‌తో పాటు మైదాన ప్రాంతాలన్నీ తెల్లటి మంచు దుప్పటిల మారాయి. చాలా కాలంగా పొడిగా ఉన్న వాతావరణం ఇప్పుడు ఈ హిమపాతం ఎంతో చక్కటి దృశ్యాన్ని ఇస్తుంది.
కాశ్మీర్ లోని చుట్టుపక్కల ప్రాంతాలతో సహా కొన్ని ప్రాంతాలలో భారీ హిమపాతం వల్ల ఉష్ణోగ్రతలు -27 డిగ్రీల సెల్సియస్ నుండి -4 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నాయి.
ఈ హిమపాతం అంటే మంచు కురవడం వల్ల చెట్ల కొమ్మలు, పొలాలు, ఇళ్ల పైకప్పులు మొత్తం మంచుతో కప్పబడ్డాయి. ఇదంతా చూడటానికి ప్రయాణికలకు ఎంతో అద్భుతంగా కనుల విందు చేస్తుంది.
కానీ చూడడానికి ఇదంతా అందం ఉన్నా, అక్కడి సాధారణ ప్రజల జీవితం మాత్రం కష్టాల్లో పడింది. రోడ్లన్నీ మంచుతో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
శ్రీనగర్ విమానాశ్రయంలో రన్‌వే పై అంతా మంచు పేరుకుపోవడంతో విమానాలు రావడం, వెళ్లడం ఆలస్యమవుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎత్తైన ప్రాంతాల్లో ఇంకా భారీగా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది.
