
- గత వారం 19 టన్నుల పండ్లు రాక ..భారీగా తగ్గిన ధరలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆపిల్‌కు సీజన్‌కావడంతో నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి సేపులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌నుంచి ప్రతిరోజూ ట్రక్కుల కొద్దీ సేపులు బాటసింగారం పండ్ల మార్కెట్‌కు చేరుకుంటున్నాయి. ఆగస్టు నెలాఖరులో హిమాచల్ ప్రదేశ్ నుంచి సిమ్లా రకం ముంచెత్తగా, ఇప్పుడు కాశ్మీర్రకం పండ్లతో మార్కెట్కళకళలాడుతోంది.
గత వారం బాటసింగారం మార్కెట్‌కు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ల నుంచి19 టన్నుల ఆపిల్స్ వచ్చాయి. ఇందులో కాశ్మీర్ నుంచి వచ్చినవే ఎక్కువ. సెప్టెంబర్‌లో వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల కాశ్మీర్‌నుంచి ఆపిల్స్ఎక్కువగా రాలేదని, ఈ నెల ప్రారంభం నుంచి మాత్రం లోడ్ల మీద లోడ్లు వస్తున్నాయని వ్యాపారులు చెప్తున్నారు.
నవంబర్, జనవరి మధ్య హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్‌నుంచి దాదాపు 2,500 ట్రక్కులు సిటీకి వస్తాయని, ఒక ట్రక్కులో 600 నుంచి 1,000 పెట్టెలు వస్తాయంటున్నారు. ఒక్కో పెట్టెలో 50, 150 లేదా 180 ఆపిల్స్ ఉంటాయన్నారు.
ఇవీ ఫేమస్..
కాశ్మీర్ లో కులు డెలిషియస్, కినోర్, జోంథన్, మహారాజీ, బల్గేరియా ట్రెల్, దోధి అంబ్రీ, చారీ అంబ్రీ, వాలాయతీ అంబెరీ మహ్ అంబ్రీ వంటి రకాలను పండిస్తారని, అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో రాయల్ డెలిషియస్, డార్క్ బారన్ గాలా, స్కార్లెట్ స్పర్, రెడ్ వెలాక్స్ గోల్డెన్ డెలిషియస్ వంటి రకాలను విస్తృతంగా పండిస్తారని మార్కెట్ఆఫీసర్తెలిపారు.
ఆగస్టు నెలాఖరు నుంచి సిటీకి ఆపిల్ పండ్ల రాక మొదలవుతుందని, ఆ టైంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి రైతులు లేదా ఏజెంట్లు ఇక్కడికి తీసుకువస్తారని చెప్పారు. ఆగస్టు, సెప్టెంబరు వచ్చేసరికి ధరలు విపరీతంగా ఉంటాయని, కానీ, అక్టోబర్‌లో కాశ్మీరీ రకాలు రావడం మొదలుకాగానే ధరలు క్రమంగా తగ్గుముఖం పడతాయని చెప్పారు.