మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్స్ గా జనసేన అభ్యర్థులు

మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్స్ గా జనసేన అభ్యర్థులు

త్వరలో జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే తమ అభ్యర్థులు పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీచేయడం లేదన్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో పోటీచేయడం లేదని  చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుందని తెలిపింది. ఆసక్తి ఉన్న వారు స్వంతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి ఉంటుందని సూచించింది. దీనికి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపింది.