జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు నిరసన సెగ

జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు నిరసన సెగ

తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నిరసన సెగ తగులుతోంది. తమ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ఎమ్మెల్యే అభ్యర్థులను నిలదీస్తున్నారు. కొన్నిచోట్ల అయితే.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరి.. తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి రావొద్దంటూ ముందుగానే హెచ్చరిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి సిద్దిపేట జిల్లాలో జరిగింది. 

సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండలం తపాస్ పల్లి గ్రామంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తపస్ పల్లి గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. 

అంతేకాదు.. తమ గ్రామం ఎలాంటి అభివృద్ధి చెందలేదని నిరసన వ్యక్తం చేస్తూ.. తపస్ పల్లి గ్రామంలో పలు అంశాలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయబోమని గ్రామస్తులు పల్లాకు తేల్చిచెప్పారు. దీంతో తపస్ పల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు.