జనగామ, వెలుగు : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని కొత్తగా నియామకమైన జనగామ డీసీసీ ప్రెసిడెంట్ లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ అన్నారు. మంగళవారం ఆమె జనగామ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడతానని, తనకు జిల్లా అధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో లీడర్లు డాక్టర్ సీహెచ్ రాజమౌళి, చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, వేమల్ల సత్యనారాయణ రెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, బుచ్చిరెడ్డి, జమాల్ షరీఫ్ తదితర లీడర్లు పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

