మేజర్ నుంచి జనగణమన సాంగ్ రిలీజ్

మేజర్ నుంచి జనగణమన సాంగ్ రిలీజ్

డిఫ్రెంట్ స్టోరీస్తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించే అడవి శేషు..మేజర్ సినిమాతో జూన్ 3 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే క్షణం, గూడచారి, ఎవరు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న అతను..మేజర్గా అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా  సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. దీంతో మేజర్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి జనగణమన సాంగ్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటలో దేశభక్తిని కళ్లకు కట్టినట్లు చూపించారు. జయహో..జయహో..ఎగిరే కలలో..రగిలే రవివో అంటూ సాగే సాంగ్ చూస్తుంటే రోమాలు నిక్కపోడుచుకోవాల్సిందే. అంతేకాకుండా ఈ సాంగ్లో సందీప్ ఉన్ని కృష్ణన్ చిన్నతనంలో జవానుగా ఎందుకు అవ్వాలనుకున్నాడో చూపించారు. అలాగే 26/11 ముంబై టెర్రరిస్టు దాడులు జరిగిన తీరును చూపించారు. మొత్తంగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని ఈ పాటలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సాంగ్కు రాజీవ్ భరద్వాజ్ సాహిత్యాన్ని అందించగా..టోజన్ టోబి సాంగ్ ను పాడారు.  ఈ అద్భుతమైన సాంగ్ను మీరు చూసేయండి.