
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దాడికి ఎలాంటి కుట్ర జరగలేదని జూబ్లీహిల్స్ పోలీసులు తేల్చారు. జూబ్లీహిల్స్ లోని పవన్ ఇంటి వద్ద రెక్కీ కేసులో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో పబ్ నుంచి వస్తూ పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారు ఆపారని.. కారు తీయాలన్న పవన్ సెక్యూరిటీతో వాళ్లు గొడవ పడ్డట్లు పోలీసులు చెప్పారు.
మరో వైపు జూబ్లీహిల్స్ లోని పవన్ కల్యాణ్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారని ప్రచారం జరగడంతో జనసేన కార్యకర్తలు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పవన్ ఇంటి సమీపంలోని పబ్ మూసేయాలని జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. నివాస ప్రాంతాల మధ్య పబ్ లు ఉండొద్దని జనసేన నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఆందోళన చేసిన వారిని అడ్డుకుని పోలీసులు పీఎస్ కు తరలించారు