తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే

తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాల్సిందే

తెలంగాణ ప్రజలకు ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీకి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా.. ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, కౌంటర్లు హద్దులు దాటుతుందన్నారు పవన్ . విమర్శలు, ప్రతి విమర్శలు పరిధి దాటకూడదన్నారు పవన్ కల్యాణ్. ఈ మేరకు ట్విట్టర్ లో వీడియో రిలీజ్ చేశారాయన. 

ప్రజలు వేరు – రాజకీయ నేతలు వేరని.. రాజకీయ నేతలను తిడితే తెలంగాణ సమాజాన్ని.. ప్రజలను తిట్టటం ఏంటని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. తెలంగాణ ప్రజలను తిట్టటం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడటం వ్యక్తిగతంగా చాలా ఆవేదన కలిగించిందన్నారు పవన్ స్టార్. వైసీపీ నేతలు అందరూ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజలను లాగొద్దన్నారు. ప్రజలను – పాలకులను కలిపి చూడొద్దని.. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని..  వైసీపీ మంత్రులు కంట్రోల్ లో ఉండాలన్నారు పవన్ కల్యాణ్. 

https://twitter.com/JanaSenaParty/status/1647676220107280384

తెలంగాణ జాతిని, సమాజాన్ని తిడుతుంటే వైసీపీ పెద్దలు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ.. అందరినీ కంట్రోల్ చేయాల్సి బాధ్యత సీఎం జగన్ పై లేదా అని నిలదీశారాయన. తెలంగాణ ప్రజలను తిట్టటం.. ప్రాంతాన్ని విమర్శించటం సరి కాదన్నారు పవన్ కల్యాణ్. ఏపీ మంత్రులు, నేతలకు తెలంగాణలో వ్యాపారాలు లేవా అని ప్రశ్నించారు. బొత్సా లాంటి వారికి తెలంగాణలో మొన్నటి వరకు కేబుల్ వ్యాపారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. ఇప్పటికైనా రాజకీయ విమర్శలు మాత్రమే ఉండాలని.. ప్రజలను లాగొద్దని.. ఇదే జనసేన విధానం అన్నారాయన.