రామ మందిర నిర్మాణానికి పవన్ కల్యాణ్ భారీ విరాళం

V6 Velugu Posted on Jan 22, 2021

తిరుపతి: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రూ. 30 లక్షలను విరాళంగా ప్రకటించారు. సంబంధిత చెక్కును ఆర్ఎస్ఎస్ ప్రముఖులు భరత్‌జీకి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. సహనం, శాంతి, త్యాగం, శౌర్యం.. ఈ దేశం ఎలాంటి దాడులు, ఒడిదుడుగులు ఎదురైనా మన దేశం బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరాముడు చూపిన మార్గమే. పరమత సహనం మనదేశంలో ఉందంటే అది ఆయన చూపిన దారే. అందుకే రామరాజ్యం అన్నారు. అన్ని మతాల వారు, ప్రాణకోటి సుఖంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం కడుతుంటే భారతీయులంతా, పిల్లాపాపలంతా విరాళాలు ఇస్తున్నారు. నా వంతుగా రూ.30 లక్షలు ఇస్తున్నా.” అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతిలో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యు నేత భరత్ చెక్కును అందించారు పవన్ కళ్యాణ్. ఆయ‌న‌ వ్యక్తిగత సిబ్బంది కూడా రూ.11వేలు ఇచ్చారు. కులాలకు, మతాలకు అతీతంగా రామ మందిర నిర్మాణానికి తన సిబ్బంది ముందుకు రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు పవన్.

Tagged Ayodhya, construction of Rama Mandir, donates rs.30 lakh, Janasena Chief Pawan Kalyan

Latest Videos

Subscribe Now

More News