ఇంగ్లీష్ కాదు..ముందు రైతులను పట్టించుకోండి

ఇంగ్లీష్ కాదు..ముందు రైతులను పట్టించుకోండి

పండించిన పంటకు గిట్టుబాటు ధర  లేక రైతులు అప్పులపాలవుతున్నారన్నారు జనసేన అధినేత పవన్. చిత్తూరు జిల్లా మదనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. అక్కడ టమాట రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. సీఎం జగన్ పై విమర్శలు చేశారు. రైతులకు అండగా ఉందామన్న ఆలోచన జగన్ లేదన్నారు. ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టడం,  మాజీ సీఎం ఇళ్లు కూల్చుదాం, కాంట్రాక్టులు రద్దు చేద్దాం అనే ఆలోచనలు తప్ప రైతుల పక్షాన నిలబడదామన్నా ఆలోచన జగన్ కు లేదన్నారు. ఆరు నెలల సమయాన్ని జగన్ వృథా చేశారని అన్నారు .రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.  కావాల్సింది ఇంగ్లీష్ కాదని..ముందు రైతులను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు పవన్ . రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే తర్వాత వారికి ఇష్టమైన భాషలో వారి పిల్లలను చదివిపించుకుంటారన్నారు.