
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపురోజున ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం... రేపు ఉదయం హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ నల్గొండకు బయలుదేరుతారు.
ఈ నెల 20వ తేదీన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారి నల్గొండ జిల్లా పర్యటన.
— ???????? ????????? (@JSPTelangana) May 19, 2022
ప్రమాదవశాత్తు మృతిచెందిన చౌటుప్పల్, హుజూర్ నగర్ కు చెందిన జనసైనికులు కొంగరి సైదులు, కడియం శ్రీనివాసరావు గారి కుటుంబాలను పరామర్శించి 5 లక్షల రూపాయల భీమా చెక్కు అందజేయనున్నారు.#JSPActiveMembership pic.twitter.com/qj19lzWwDe
మొదట చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామానికి చేరుకొని.... కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి కోదాడకి వెళ్తారు. అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పవన్ కల్యాణ్ ఆర్ధిక సాయం అందిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం...