GHMC ఎన్నికల బరిలో జనసేన

GHMC ఎన్నికల బరిలో జనసేన

GHMC ఎన్నికలపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. యువ కార్యకర్తల విజ్ఞప్తి ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

GHMC ఎన్నికల్లో పోటీ చేయాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని, వారి అభ్యర్ధనకు అనుగుణంగా అభ్యర్ధులను నిలుపుతామని జనసేనాని తెలిపారు. దీనికి సంబంధించి అధికార ప్రకటన చేశారు.

జీహెచ్‌ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయన్నారు పవన్. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఉన్న జనసేన… ఈ GHMC ఎన్నికల్లో కూడా బీజేపీతో కలిసిపోటీ చేస్తుందా..లేక ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు జనసేన కార్యకర్తలు.