
- వెల్లడించిన బీజేపీ వర్గాలు
న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జమ్మూకాశ్మీర్ బీజేపీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా గురువారం అర్థరాత్రి సమావేశమయ్యారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశానికి.. రాష్ట్ర బీజేపీ యూనిట్ చీఫ్ రవీందర్ రైనా, ఎంపీలు జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ శర్మ ఇతర నేతలు అటెండ్ అయ్యారు.
ఆగస్టు 19న అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తర్వాత.. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర నేతలను బీజేపీ హైకమాండ్ ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొత్తం 90 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని చెప్పాయి. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదని తెలియజేశాయి. పార్టీ తరఫున సీఎం అభ్యర్థిని కూడా ప్రకటించడంలేదని..ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రానికి రానున్నారని వివరించాయి.