రైతులతో కలిసి నాటేసిన జనగామ కలెక్టర్

రైతులతో కలిసి నాటేసిన జనగామ కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ వడ్లకొండలో రైతులతో కలిసి వరినాట్లు వేశారు. మంగళవారం వడ్లకొండకు వెళ్లిన ఆయన అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మారబోయిన బుచ్చిరాములు పొలంలో రైతులతో కలిసి వరి నాట్లు వేశారు.

కలెక్టర్​మాట్లాడుతూ సేంద్రియ ఎరువులను ఉపయోగించి సాగు చేయాలన్నారు. తర్వాత బిక్షపతి పొలంలో వేసిన పచ్చిరొట్ట పంట పరిశీలించారు. డీఏవో వినోద్ కుమార్, ఏఈఓలు, ఏఓలు పాల్గొన్నారు.     
                      
- జనగామ అర్బన్, వెలుగు