గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించేందుకే జన్​మన్ : రవీంద్ర నాయక్

గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందించేందుకే  జన్​మన్ : రవీంద్ర నాయక్

హైదరాబాద్, వెలుగు :  గిరిజనుల అభ్యున్నతిని ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (జన్ మన్) పథకాన్ని ప్రారంభించిందని మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్రనాయక్​ అన్నారు. బీజేపీ స్టేట్​ ఆఫీసులో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో 740 గిరిజన తెగలున్నాయని.. అందులో 75 తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయని తెలిపారు. గిరిజనులు, అంతరించే దశలో ఉన్నటువంటి తెగలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు.