వైరల్ వీడియో: అయ్య బాబోయ్ ... ఇలాగా కూడా నడుస్తారా...

వైరల్ వీడియో: అయ్య బాబోయ్ ... ఇలాగా కూడా నడుస్తారా...

సర్కస్ లో ఫీట్లు చూశాం. అక్కడ తాడుపై నడుస్తుంటే పొరపాటున జారిన దెబ్బలు తగులకుండా కింద వల ఉంటుంది.   అలా చేయడమే వారి జీవనాధారం.  కాని జనాలు సోషల్ మీడియాలో వైరల్ కావడానికి జనాలు చేసే పిచ్చిపిచ్చి వేషాలు అన్నీ ఇన్నీకావు.  వాటికి అలా వచ్చే లైక్ లు, షేర్ లు చూసి మురిసిపోతుంటారు.  తాజాగా ఓ వ్యక్తి రెండు టవర్ల మధ్య 492 అడుగు తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా నడిచే వీడియోను చూసిన నెటిజన్లు.. బాబోయ్ ఇలాగా కూడా నడుస్తారా అంటూ ఆశ్చర్య పోతున్నారు.

పలుచటి గోడపై ఎలాంటి ఆధారం లేకుండా రెండు మూడు అడుగులు వేయాలంటేనే మనం భయపడుతాం.. రెండు కర్రల మధ్య తాడుపై నడిచే వారిని చూసి అమ్మో.. ఎలా నడుస్తున్నారుఇలా అని ఆశ్చర్య పోతాం. కానీ, మీరు ఈ వీడియో చూసే వణికిపోతారు. ఓ వ్యక్తి రెండు టవర్ల మధ్య 492 అడుగుల తాడుపై ఎలాంటి ఆధారం లేకుండా నడిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. 

జాన్ రూజ్ షేర్ చేసిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. కొందరు అతన్ని సూపర్ హీరో అని పిలుస్తుండగా.. మరికొందరు ప్రమాదాలతో పోరాడే వ్యక్తి అని పిలుస్తున్నారు. చాలా మంది దీనిని నమ్మశక్యం కానిదిగా అభివర్ణిస్తున్నారు. ఓ నెటిజన్.. ఇలా ఎందుకు చేయాలి? మీ ప్రాణాలను ఫణంగా పెట్టి ఇతరులను బాధపెట్టడం సరదా? స్వార్థపూరితంగా కనిపిస్తోంది అంటూ విమర్శిస్తూ కామెంట్ చేశాడు.

ఎస్టోనియాకు చెందిన స్లాక్ లైన్ అథ్లెట్ జాన్ రూజ్ ఇలాంటి ఫీట్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 492 అడుగుల ఎత్తులో రెండు బిల్డింగ్‌ల మధ్య సన్నటి తాడుపై నడిచాడు. గత ఆదివారం ఖతార్‌లోని లుసైర్ మెరీనాలో ఈ ఫీట్ చేశాడు. ఈ వీడియోలో వేగంగా వీస్తున్న గాలితో అటూఇటూ వణుకుతూ తాడుపై నడుస్తుండటం చూడొచ్చు. బలమైన గాలుల మధ్య సమతుల్యతను సాధించడానికి జాన్ రూజ్ ప్రయత్నాన్ని వీడియోలో చూడొచ్చు. ఎలాంటి ఆధారం లేకుండా అతను తాడుపై నడిచాడు. ఈ ఫీట్‌తో అతను ప్రపంచంలోనే పొడవైన సింగిల్ బిల్డింగ్ స్లాక్‌లైన్‌గా రికార్డు సృష్టించాడు.