
- హెల్త్ ఎంప్లాయిస్ కు సేఫ్ గార్డ్స్ కొరత
- పేషెంట్లను ట్రీట్ చేసేందుకు భయపడుతున్న మెడికల్ స్టాఫ్
జపాన్ : కరోనా ఎఫెక్ట్ జపాన్ ను ఆగం చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఇక్కడ ఎమర్జెన్సీ మెడికల్ సిస్టం అస్తవ్యస్తంగా మారింది. కరోనా కారణంగా ఇతర పేషెంట్లకు ఎమర్జెన్సీ వైద్యం అందటం లేదు. స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, యాక్స్ డెంట్ లో గాయపడిన వారికి ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ అందించేందుకు ఇక్కడ హాస్పిటల్స్ భయపడుతున్నాయి. అలాంటి వారికి కరోనా ఉండొచ్చేమోనని ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ అవసరమైన పట్టించుకోవటం లేదు. ఈ మధ్యనే జ్వరం, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్న ఓ పేషెంట్ కు ట్రీట్ మెంట్ ఇప్పించేందుకు 80 హాస్పిటల్స్ తిరగాల్సి వచ్చింది. దీనిపై జపాన్ సోసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఐతే ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ వైఫల్యమేనని వారు విమర్శిస్తున్నారు. అనుమానిత లక్షణాలున్న వారందరినీ హాస్పిటల్స్ లో చేర్చుతుండటంతో హాస్పిటల్ లో రద్దీ పెరిగి కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందంటున్నారు. ఎవరి ద్వారా కరోనా సోకుతుందోనని ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ కూడా హాస్పిటల్స్ జంకుతున్నాయని చెబుతున్నారు.
సేఫ్ గార్డ్స్ కొరత
కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేసేందుకు ఇక్కడి సిబ్బంది జంకుతున్నారు. కారణం వీరికి హజ్మత్ గౌన్స్, మాస్క్ లు, ఇతర ప్రొటెక్టివ్ మెడికల్ ఎక్విప్ మెంట్లు కొరత ఉన్నాయి. ఎన్ 95 మాస్క్ లను మార్చి, మార్చి వాడుతున్నారు. సరైన సేఫ్ గార్డ్ లేకపోవటంతో హాస్పిటల్స్ సిబ్బంది కూడా ఇన్ ఫెక్షన్ కు గురవుతున్నారు. ఇక వెంటిలేటర్స్, బెడ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో రిస్క్ అలవెన్స్ భారీగా పెంచాలంటూ హెల్త్ ఎంప్లాయిస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హెల్త్ ఎంప్లాయిస్ కొరత కూడా తీవ్రంగా ఉంది. జపాన్ పీఎం షింజో అబే ఇప్పటికే వెంటిలేటర్లు, హజ్మత్ గౌన్స్ వేగవంతంగా సప్లయ్ చేయాలని అక్కడి సంస్థలను కోరారు. వారం రోజుల్లో హెల్త్ సిబ్బంది అందరికీ కావాల్సిన సేఫ్ గార్డ్స్ అన్నింటిని సిద్ధం చేస్తామని చెప్పారు.
నిర్లక్ష్యం చేస్తే 4 లక్షల మంది చనిపోతారు
జపాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైరస్ టాస్క్ ఫోర్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది. సరైన ప్రివెంట్ మేజర్స్ తీసుకోకపోతే దేశంలో కనీసం 4 లక్షల మంది కరోనా చనిపోతారని తెలిపింది. సోషల్ డిస్టెన్స్ తో సహా కరోనా నివారణకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను మరింత పెంచాలని సూచించింది. టోక్యో లాంటి సిటిలోనే ఫిజికల్ డిస్టెన్స్ ను జనం పాటించటం లేదు. మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పటికీ ట్రైన్లలో పెద్ద ఎత్తున జనం ప్రయాణం చేస్తున్నారు. ఇలా అయితే కరోనా విజృంభించే చాన్స్ ఉందని అదే జరిగితే హ్యాండిల్ చేయటం కష్టమని ప్రభుత్వానికి తెలిపింది. జపాన్ లో లక్ష మందికి 5 ఐసీయాలు మాత్రమే ఉన్నాయి. వెంటిలేటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం జపాన్ లో దాదాపు 10 వేల మంది కరోనా బారిన పడ్డారు. ఈ సంఖ్య మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ సిబ్బంది ఆరోగ్యాన్ని రక్షించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి జపాన్ మెడికల్ అసోసియేషన్ సూచించింది.