మేకప్ లేకుండా వచ్చాడు.. ప్రియురాలిని భయపెట్టాడు

మేకప్ లేకుండా వచ్చాడు.. ప్రియురాలిని భయపెట్టాడు

మేకప్ రూపాన్ని మార్చేస్తుంది.  ఒక్కోసారి మేకప్ లేకపోతే మనల్ని మనమే గుర్తుపట్టలేం.  ఇక పెళ్లిళ్లు, పబ్బాలు అయితే సరే సరి.. ఇ ప్పుడు ఈ వార్త  ఎందుకంటారా.. జపాన్ లో ఓ వ్యక్తి టాప్ టూ బాటమ్ వరకు మేకప్ వేసుకుంటాడు.  అంటే తల నుంచి కాలి గోరు వరకు అన్నమాట.  మారు వేషాలతో మహిళలతో సరసాలడతాడు.  ఒకానొక సమయంలో ప్రియురాలితో సరదాగా గడిపి.. బాత్రూంకి వెళ్లి  ., మేకప్ తీసేని రావడంతో ఆమె భయపడిందని జపనీస్ మేకప్ మేన్ తెలిపారు.

మేకప్ విషయంలో ప్రాచుర్యం

జపనీస్ మేకప్ ఆర్టిస్ట్   ఆన్‌లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్ హతెన్యన్ అనే వ్యక్తి తన నిజ స్వరూపాన్ని మేకప్ తో కప్పేస్తాడు.   22 ఏళ్ల హిటేనియన్ తన స్వదేశమైన జపాన్‌లో  మేకప్ విషయంలో బాగా ప్రాచుర్యం పొందాడు.  అయితే ఆవ్యక్తి సోషల్ మీడియాలో బాగా పాపులర్ కావడంతో చాలా ప్రాచుర్యం పొందాడు.  ఇతనికి ట్విట్టర్లో 7 లక్షల మంది అభిమానులు ఉన్నారు.  ఇక  ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ , యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల మంది అభిమానులున్నారు.  అతను తరచు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటాడు.  తాజాగా అతని ట్వీట్లలో ఒకటి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.  

మేకప్ లేకపోతే కనుక్కోవడం కష్టం

ఈ ట్వీట్‌లో, అతను మేకప్ లేకుండా, మేకప్ తో ఉన్న  తన ఫోటోను పోస్ట్ చేశారు.  రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అవి ఒకరివేనని గుర్తించడం అసాధ్యంగా ఉంది.   హతెన్యన్  మేకప్  స్వయంగా నేర్చుకుని తన ఫోటోలను పోస్ట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 

ప్రియురాలిని  భయపెట్టాడు

జపనీస్ మేకప్ ఆర్టిస్ట్ హతెన్యన్ మేకప్ ఫోటోను ట్విట్టర్ లో తన ప్రొఫైల్ ఫోటోగాపెట్టుకున్నాడు.  అతడ్ని చూడగానే అమ్మాయిలు అతని వైపు ఆకర్షితులయ్యారు. ఒకసారి తన ప్రియురాలితో   డేటింగ్‌కి వెళ్లి, ఆపై ఆమె ఇంటికి వెళ్లాడు. మేకప్ తీసేసి బాత్ రూం నుంచి బయటకు రాగానే అతని ప్రియురాలు  భయపడి అతడిపై కోపం పెంచుకుంది. అప్పుడు ఎవరో కూడా చెప్పలేదు. 

చాలా మంది మహిళలు మేకప్ లేనిదే బయటకు రారు.  వారు వేసుకున్న మేకప్ కళ ఆశ్చర్యపరుస్తుంది.  చాలా మంది మేకప్ ఆర్టిస్టుల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అందులో వారు పెళ్లికి సిద్ధమవుతున్న అమ్మాయి .. వధువును పూర్తిగా మార్చేస్తారు. కానీ ఈ రోజుల్లో ఒక జపనీస్ వ్యక్తి తన మేకప్ గురించి సోషల్ మీడియాలో వైరల్అయ్యాడు.  . అతను పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మారే విధంగా మేకప్‌తో తనను తాను మార్చుకుంటాడు.