జపాన్ ఎయిర్ లైన్స్ లబోదిబో.. క్యాబ్ ఛార్జీలతో సమానంగా విమాన టికెట్లు

జపాన్ ఎయిర్ లైన్స్ లబోదిబో.. క్యాబ్ ఛార్జీలతో సమానంగా విమాన టికెట్లు


అంతా టెక్నాలజీ మయం.. కంప్యూటర్ ఏం చెబితే అదే ఫైనల్.. అదేలా జరిగింది.. అది ఎలా సాధ్యం అనే కనీస అవగాహన కూడా వాళ్లకు ఉండటం లేదు.. ఇది ఉద్యోగుల పరిస్థితి అయితే.. కొనుగోలు చేసినోళ్లు మాత్రం ఏంటీ ఇంత చీప్ గా టికెట్లు ఇస్తున్నారు అంటూ ఎగబడి టికెట్లు కొనుగోలు చేశారు. జపాన్ కు ప్రముఖ ఎయిర్ లైన్స్ టికెట్ బుకింగ్స్ లో జరిగిన లోపం కారణంగా.. వందల కోట్ల రూపాయలు నష్టపోయింది ఆ సంస్థ. ఇదెలా జరిగింది అనేది ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ఎయిర్ లైన్స్ ఆరా తీయటం ఆసక్తిగా మారింది. 

జపాన్‌లోని అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (ANA) అమెరికా, యూరప్, ఏషియా దేశాలకు విమానాలను నడుపుతుంది. రీసెంట్ గా ఈ ఎయిర్ లైన్స్ సంస్థ.. జకార్తా నుంచి టోక్యోకు బిజినెస్ క్లాస్ టికెట్ ను జస్ట్ 24 వేల రూపాయలకు అమ్మింది. వాస్తవ ధర 8 లక్షల 20 వేల రూపాయలు. అంతేనా.. జకార్తా నుంచి హోనోలు ప్రాంతానికి రౌండ్ ట్రిప్ బిజినెస్ క్లాస్ టికెట్ ను 45 వేలకు ఇచ్చింది. వాస్తవంగా ఈ టికెట్ ధర 6 లక్షల 80 వేల రూపాయలు. ఇక న్యూయార్క్ టూ జకార్తా మధ్య టికెట్ ను 73 వేలకే అమ్మింది. వాస్తవంగా ఈ ధర లక్షల్లో ఉంటుంది. రెగ్యులర్ ధర కంటే ఈ ఎయిర్ లైన్స్ లో అన్ని టికెట్లు 20 రెట్లు తక్కువగా అమ్మటం సంచలనంగా మారింది. వందల కోట్లు నష్టపోయిన తర్వాత కానీ కంపెనీ యాజమాన్యం, మేనేజ్ మెంట్ మేల్కోవకపోవటం విశేషం. 

ఈ ఎయిర్ లైన్స్ లో టికెట్ బుకింగ్స్ అన్నీ ఆన్ లైన్ కంప్యూటర్ ద్వారా జరుగుతాయి. సాఫ్ట్ వేర్ లో తలెత్తిన సమస్య వల్ల టికెట్ రేట్లు అన్నీ  ఎంట్రీ లెవల్ కు పడిపోయాయి. టికెట్లు ఇంత తక్కువగా బుక్ అవుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. కంపెనీ బిగ్ ఆఫర్ ప్రకటించిందనే ఉద్దేశంతో ఉద్యోగులు సైతం లైట్ తీసుకున్నారు. టికెట్ చేస్తున్న ప్రయాణికులు కూడా ఇంత చౌక బేరం మళ్లీ రాదు అంటూ ఎగబడి కొనుగోలు చేశారు. ఈ విధంగా వందల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి.. వాళ్లు ప్రయాణాలు కూడా చేశారు. 

తీరా కంపెనీ మేనేజ్ మెంట్ అసలు విషయాన్ని గమనించి.. నివారణ చర్యలు చేపట్టేలోపే జరగాల్సిన వందల కోట్ల నష్టం జరిగిపోయింది. సాఫ్ట్ వేర్ లో తలెత్తిన టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల టికెట్ రేట్లు భారీగా పడిపోయాయని.. మానవత్వం ఉన్న ప్రయాణికులు తిరిగి డబ్బు చెల్లించాలని కోరినా.. అబ్బే ఎవరూ తిరిగి ఇవ్వలేదంట. తప్పు కంపెనీ వైపే ఉంది కాబట్టి సరిపోయింది.. అదే ప్రయాణికుల వైపు ఉండి ఉంటే వదిలేవాళ్లా అంటున్నారు ప్రయాణికులు. పోనీగా ఆటో, క్యాబ్ ఛార్జీలతో దేశాల మధ్య తిరిగేశారు.. అప్పుడప్పుడు ఇలా జాక్ పాట్స్ దొరుకుతుంటాయి..