
జపాన్ లో రికార్డు స్థాయిలో ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. జపాన్ లో ఉన్న ఇండ్లలో దాదాపు 13.8 శాతం అంటే దాదాపు 90 లక్షల ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది.30ఏళ్లలో ఇదే అత్యధికం. జనాభా వృద్ధాప్యం, గ్రామీణ వలసలే ఇందుకు కారణంగా తేల్చింది.
జపాన్‌లో ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఇళ్లు ఖాళీగా ఉండటం ఆ దేశానికి ఆర్థికంగా, సామాజికంగా పెద్ద సవాల్‌గా మారింది. తాజా గణాంకాల ప్రకారం..దేశవ్యాప్తంగా పది మిలియన్లకు పైగా ఇళ్లు ఖాళీగా ఉన్నాయి.అంటే మొత్తం నివాస గృహాలలో సుమారు 14 శాతం.
కారణాలివే..
వృద్ధ జనాభా..జపాన్‌లో వృద్దుల సంఖ్య రోజురోజుకు పెరగడం, యువత నగరాలకు వలస వెళ్లడం, వృద్ధులు మరణించిన తర్వాత వారి ఇళ్లు ఖాళీగానే మిగిలిపోవడంతో పెద్ద ఎత్తున ఇళ్లు ఖాళీగా పడి వుంటున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో జనసంఖ్య తగ్గుదల..పల్లె ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో యువత పట్టణాలకు వలస వెళ్లడంతో లక్షల్లో ఇండ్లు ఖాళీ అవుతున్నాయి.
అధిక ఖర్చులు, వారసులు లేకపోవడం..పాత ఇళ్లు మరమ్మతులకు అధిక ఖర్చు అవ్వడం, వారసులు ఆ ఇళ్లను వినియోగించకపోవడం లేదా అమ్మకానికి పెట్టకపోవడం వలన అవి వాడుకలోకి రావట్లేదు. దీంతో నిరుపయోగంగా ఉంటున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించేందుకు జపాన్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆకియా బ్యాంకులు (Akiya Banks) అనే ప్రోగ్రాంలు ప్రారంభించి..ఖాళీ ఇళ్లను తక్కువ ధరలకు అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం చేస్తోంది. జపాన్ లో ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తులో జపాన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ,గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.