Cricket World Cup 2023: ప్రాక్టీస్‌లో కనిపించని బుమ్రా.. ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళన

Cricket World Cup 2023: ప్రాక్టీస్‌లో కనిపించని బుమ్రా.. ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళన

వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. ఎంతటి జట్టయినా సొంతగడ్డపై చిత్తు చేసేస్తున్నారు. వరుసగా మూడు విజయాలే కాదు వాటిని భారీ విజయాలుగా మలిచి పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పై రేపు (అక్టోబర్ 19) పూణే వేదికగా మ్యాచ్ ఆడాల్సి ఉంది. పాక్ మ్యాచ్ తర్వాత నాలుగురోజుల పాటు విరామం దొరకడంతో ప్రాక్టీస్ పై మరింతగా ఫోకస్ పెట్టారు. అయితే  ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో బుమ్రా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా ప్రాక్టీస్ లో కనిపించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. పాకిస్థాన్ పై శనివారం మ్యాచ్ ఆడిన భారత జట్టు ఆ తర్వాత గురువారం, ఆదివారం వరుసగా బంగ్లాదేశ్, న్యూజీలాండ్ జట్లతో మ్యాచులు ఉన్నాయి. అంటే వారం రోజుల వ్యవధిలో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. 

దీన్ని దృష్టలో ఉంచుకొని ఈ  స్టార్ పేసర్ పై పని భారం తగ్గించాలనే ఉద్దేశ్యంలో బంగ్లాపై రెస్ట్ ఇచ్చే ఆలోచనలో జట్టు యాజమాన్యం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. బుమ్రాకి గాయమైందనుకుంటూ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. మరో ప్రధాన సీమర్ సిరాజ్ కి కూడా ఈ మ్యాచులో రెస్ట్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అదే సమయంలో షమీ నెట్స్ లో ఎక్కువ సేపు బౌలింగ్ వేస్తూ కనిపించాడు. మొత్తానికి బంగ్లా లాంటి చిన్న మ్యాచులో బుమ్రాను ఆడిస్తుందో లేకపోతే రెస్ట్ ఇస్తుందో చూడాలి. 

కాగా.. ఈ ప్రాక్టీస్ సెషన్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేయడం హైలెట్ గా మారింది. అశ్విన్ దగ్గర సలహాలు తీసుకుంటూ తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయడం విశేషం. ఇక టాపార్డర్ రోహిత్, గిల్, కోహ్లీ చాలా సేపు ప్రాక్టీస్ సెషన్స్ లో చెమటోడ్చారు.