IND vs AFG: సిరాజ్ అడుగు జాడల్లో బుమ్రా.. ఇంగ్లాండ్ ఫుట్ బాలర్ తరహాలో సెలెబ్రేషన్స్

IND vs AFG: సిరాజ్ అడుగు జాడల్లో బుమ్రా.. ఇంగ్లాండ్ ఫుట్ బాలర్ తరహాలో సెలెబ్రేషన్స్

ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఎంత క్రేజ్ ఉందనే సంగతి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు.వీరి హెయిర్ స్టైల్ దగ్గరనుంచి సెలెబ్రేషన్ వరకు చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. దీనికి క్రికెటర్లు మినహాయింపేమి కాదు. అయితే ఇండియన్ క్రికెటర్లు వీరిని ఫాలో అవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఐపీఎల్ సందర్భంగా సిరాజ్ రోనాల్డో సెలబ్రేషన్ ని అనుసరించగా.. తాజాగా మరో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ ఫుట్ బాల్ స్టార్ శైలిని అనుకరించాడు. 

ALSO READ: Cricket World Cup 2023: నీ సరదా ఇక్కడితో ఆపేయ్.. అని కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు: జార్వో

ఆఫ్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోకాగా ఇన్నింగ్స్ 7 వ ఓవర్లో బుమ్రా భారత్ కి తొలి వికెట్ ని అందించాడు. బుమ్రా వేసిన ఔట్ స్విన్గర్ ని ఎదుర్కొనే క్రమంలో బంతి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ బ్యాట్ అంచుని తాకుతూ వికెట్ కీపర్ రాహుల్ చేతిలో పడింది. ఈ వికెట్ అనంతరం బుమ్రా ఇంగ్లీష్ ఫుట్ బాల్ స్టార్ మార్కస్ రాష్‌ఫోర్డ్ సెలెబ్రేషన్ చేస్తూ కనిపించాడు. తన చూపుడు వేలిని బ్రెయిన్ దగ్గర ఉంచి కాసేపు సైలెంట్ గా ఉన్నాడు. సాధారణంగా చాలా సౌమ్యంగా ఉండే  బుమ్రా ఇలాంటి శైలిని అనుసరించడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది.

ఇక ఈ మ్యాచు విషయానికి వస్తే..మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ 32 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా కెప్టెన్ షాహిద్, ఆల్ రౌండర్ ఓమర్జాయి సెంచరీ భాగస్వామ్యంతో జట్టుని ఆదుకున్నారు. ప్రస్తుతం షాహిద్ 56, ఓమర్జాయి 51 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.