బుమ్రాకు ప్రతిష్టాత్మకమైన అవార్డ్

బుమ్రాకు ప్రతిష్టాత్మకమైన అవార్డ్

టీమిండియా పాస్ట్ బౌలర్ బుమ్రాకు మరో అరుదైన ఘనత లభించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే ప్రతిష్టాత్మకమైన పాలీగ్రమర్ అవార్డ్ కు ఎంపికయ్యాడు బుమ్రా . ఆదివారం ముంబైలో జరగనున్న బిసిసిఐ వార్షిక అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (2018-19) కు గాను ఈ అవార్డ్ అందుకోనున్నాడు.

2018 జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ మ్యాచ్ లో అడుగు పెట్టాడు.  అప్పటి నుండి బుమ్రా వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2018 నుంచి బుమ్రా బౌలింగ్ అసాధారణ రీతిలో ఉంది.  12 టెస్టు మ్యాచ్‌ల్లో  62 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా టాప్ బౌలర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ,వెస్టిండీస్‌లలో ఐదు వికెట్లు పడగొట్టిన తొలి ఆసియా బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇక 58 వన్డేలు ఆడిన బుమ్రా 103 వికెట్లు తీశాడు. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లను అధిగమించి టీ 20 ఫార్మాట్‌లో ఇండియా నుంచి అత్యధిక వికెట్లు(53) తీసిన బౌలర్ గా బుమ్రా ఫస్ట్ ప్లేసులో ఉన్నాడు.