T20 World Cup 2024: రోహిత్ కెప్టెన్ అని ఖచ్చితంగా చెప్పలేదు..హార్దిక్ త్వరలో కోలుకుంటాడు: జైషా

T20 World Cup 2024: రోహిత్ కెప్టెన్ అని ఖచ్చితంగా చెప్పలేదు..హార్దిక్ త్వరలో కోలుకుంటాడు: జైషా

2024 టీ20 వరల్డ్ కప్ లో భారత కెప్టెన్ ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిన్నటివరకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ పేరు వినిపించినప్పటికీ తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా చేసిన కామెంట్స్ కొత్త అనుమానాలకు దారి తీస్తుంది. ఈ వరల్డ్ కప్ కు రోహిత్ శర్మను కెప్టెన్ గా మేము ప్రకటించలేదంటూ.. హార్దిక్ గాయంపై అప్ డేట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు కెప్టెన్సీ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. 
      
BCCI కార్యదర్శి జైషా టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ పునరాగమనంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి ఇష్టపడలేదు. జూన్-జూలైలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగబోయే T20 ప్రపంచకప్‌కు భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ ఉంటాడని వార్తలు వచ్చినప్పటికీ..ఎవరు కెప్టెన్ అని ప్రకటించడానికి తగినంత సమయం ఉందని షా చెప్పాడు. ప్రస్తుతం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ వరల్డ్ కప్ కంటే ముందు ఐపీఎల్, ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ ఉందని జైషా శనివారం తెలిపారు. 

ఇక హార్దిక్ గాయంపై మాట్లాడుతూ.. అతడు వేగంగా కోలుకుంటున్నాడని.. జనవరిలో ఆఫ్ఘనిస్థాన్ పై జరిగే టీ20 సిరీస్ కు అందుబాటులో ఉంటాడని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పింక్ బాల్ టెస్ట్ ల గురించి మాట్లాడాడు. పింక్-బాల్ టెస్ట్ లు నిర్వహించి  ప్రజలలో ఆసక్తి పెంచాలని.. జనవరిలో ఇంగ్లాండ్ పై జరిగే 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లండ్‌తో చర్చలు జరుపుతున్నామని షా తెలియజేసారు. మొత్తానికి 2024 టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ ఎవరనే విషయంలో షా క్లారిటీ ఇవ్వకుండా అభిమానులను కన్ఫ్యూజన్ లో పడేసాడు.