అమితాబ్ బచ్చన్ దంపతుల ఆస్తులు ఎంతో తెలుసా..?

అమితాబ్ బచ్చన్ దంపతుల ఆస్తులు ఎంతో తెలుసా..?

రాజకీయ నాయకులు ఆస్తుల వివరాలు తెలుసుకోవాలని చాలా మందికి ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఆ వివరాలు ఎక్కడ దొరుకుతాయనేది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎన్నికల సమయంలో పొలిటికల్ లీడర్ ధాఖలు చేసే వారి నామినేషన్ అఫిడవిట్ లో వారిపై ఉన్న పోలీసు కేసులు, ఆస్తుల వివరాలు అందులో రాయాల్సి ఉంటుంది. ఎలక్షన్ లో పోటీ చేసిన అభ్యర్ధుల పోలీస్ కేసులు, ఆస్తుల డీటేల్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. వారికి ఎంత ఆదాయం వస్తుంది. అది ఏ మార్గాల ద్వారా వస్తోందని అందులో తెలపాలి. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ మంగళ వారం నామినేషన్ వేశారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఈమెను రాజ్యసభకు నామినేట్ చేయడం వరుసగా ఇది ఐదవ సారి.

ALSO READ :-ఎలక్టోరల్ బాండ్లలో బీజేపీ టాప్.. ఒక్క ఏడాదిలోనే 13 వందల కోట్లు

జయ బచ్చన్ ఆమె ఆస్తి వివరాలు ఆమె ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. బచ్చన్ దంపతులు ఇద్దరి పేరున రూ.1578 కోట్ల సంపద ఉన్నట్లు ఆమె అఫిడవిట్లో  తెలిపారు. ఆమెకు రూ.40 కోట్లు, అమితాబ్ బచన్ కు 54.77 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయట. రెండు మెర్సిడెస్, ఓ రేంజ్ రోవర్ తో పాటు  17.66 కోట్ల విలువైన 16 కార్లు  ఉన్నాయని చెప్పింది. అమితాబ్, జయ ల పేరు మీద 849.11 కోట్ల చరాస్తులు, 729.77 స్థిరాస్తులు ఉన్నాయి. ఎంపీ జీతం, అమితాబ్ సోలార్ ప్లాంట్, రెంట్లు, డివిడెండ్ లు, వడ్డీ రూపంలో ఆమెకు ఆదాయం వస్తున్నట్లు ఎలక్షన్ అఫిడవిల్ లో పొందుపరిచారు.