Jaya Bachchan: పెళ్లిపై జయ బచ్చన్ బోల్డ్ కామెంట్స్.. పాత వ్యవస్థ తన మనవరాలికి అక్కర్లేదన్న బిగ్ బి వైఫ్ !

Jaya Bachchan: పెళ్లిపై జయ బచ్చన్ బోల్డ్ కామెంట్స్.. పాత వ్యవస్థ తన మనవరాలికి అక్కర్లేదన్న బిగ్ బి వైఫ్ !

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, నటి జయ బచ్చన్ లకు అన్యోన్యమైన దంపతులుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న  గుర్తింపు ఉంది.  అయితే నటిగా, ఎంపీగా ఉన్న జయ బచ్చన్ లేటెస్ట్ గా వివాహం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.  ముంబైలో జరిగిన  ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..  పెళ్లి అనేది 'పాతబడిన వ్యవస్థ' (Outdated Institution) అని అన్నారు.  తన మనవరాలు నవ్య నవేలీ నందా పెళ్లి చేసుకోనవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యా్ఖ్యలు పెద్ద దుమారం రేపుతూ . . సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సంచలనం రేపుతున్న వివాహ బంధంపై వ్యాఖ్యలు..

 వైవాహిక జీవిత ఎంపికల గురించి ప్రస్తావించినప్పుడు నవ్య పెళ్లి చేసుకోవాలని నేను కోరుకోవడం లేదు అని జయ బచ్చన్ స్పష్టం చేశారు. పెళ్లి అనే  వివాహవ్యవస్థ కాలం చెల్లిపోయిందా? అన్న ప్రశ్నకు తమ అభిప్రాయాన్ని  స్పస్టం చేసింది.. ఆధునిక సంబంధాలకు చట్టపరమైన ముద్ర అవసరం లేదని, ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి కలిసి ఉంటే సరిపోతుందని ఆమె నొక్కి చెప్పారు. జయ బచ్చన్ ఈ సందర్భంగా తన వ్యాఖ్యలకు ఒక సరదా కోణాన్ని కూడా జోడించారు. నాకు నిజంగా తెలియదు. అది ఢిల్లీ లడ్డూ లాంటిది.. తిన్నా కష్టమే, తినకపోయినా కష్టమే జీవితాన్ని ఆస్వాదించండి అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.

 మారిన తల్లిదండ్రుల పాత్ర 

అంతే కాకుండా ఈ సందర్భంగా  జయ బచ్చన్ ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. నేను ఇప్పుడు అమ్మమ్మను. నవ్యకు మరో కొన్ని రోజుల్లో 28 ఏళ్లు అవుతుంది. ఈ రోజుల్లో పిల్లలను ఎలా పెంచాలి అనే దానిపై సలహా ఇవ్వడానికి నేను చాలా పాతదాన్ని అయ్యాను.  ఈ రోజుల్లో చిన్నపిల్లలు చాలా తెలివైనవారు. వారు మనల్ని మించిపోయేలా ఉంటారు అని ఆమె తెలిపారు. తరాల మధ్య ఆలోచనా విధానంలో వచ్చిన అపారమైన మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు . గతంలో ఉన్న సాంప్రదాయ పద్ధతులు, సామాజిక కట్టుబాట్లు నేటి యువతకు సరిపోవని, ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత జీవితాలను, సంబంధాలను తమకు నచ్చిన విధంగా నిర్వచించుకునే స్వేచ్ఛ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.

కొత్త చర్చకు తెర 

జయ బచ్చన్ చేసిన ఈ 'బోల్డ్' కామెంట్స్.. సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. ఒకవైపు సాంప్రదాయవాదులు ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుండగా, మరోవైపు నేటి యువతరం, ముఖ్యంగా స్వాతంత్ర్యాన్ని కోరుకునే మహిళలు ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతున్నారు. వివాహం, సహజీవనం మధ్య తేడాలు, ఆధునిక సంబంధాలలో చట్టబద్ధత ఆవశ్యకతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాదోపవాదాలు నడుస్తున్నాయి.

జయ బచ్చన్ లాంటి ఒక సీనియర్, ఎంపీ అయిన వ్యక్తి ఈ వ్యవస్థపై బహిరంగంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం.. యువతరంలో వివాహ బంధం పట్ల మారుతున్న వైఖరికి అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలో ఇప్పటికీ వివాహం ఒక బలమైన సాంస్కృతిక బంధంగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత స్వేచ్ఛ, సంబంధాల నూతన నిర్వచనం వంటి అంశాలపై దృష్టి సారించడానికి ఆమె వ్యాఖ్యలు దోహదపడుతున్నాయిని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.