ఆధ్యాత్మికం: జనవరి 29 చాలా పవిత్రమైన రోజు.. ఎట్టి పరిస్థితిలో ఈ పనులు చేయోద్దు..

ఆధ్యాత్మికం:   జనవరి 29  చాలా పవిత్రమైన రోజు..  ఎట్టి పరిస్థితిలో ఈ పనులు చేయోద్దు..

హిందువులకు ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశి రోజు  చాలా మంది ఉపవాసం ఉండి మహా విష్ణువును.. మహాలక్ష్మీదేవిని  ఆరాధిస్తుంటారు. నెలలో రెండుసార్లు ఏకాదశి వస్తుంది.  మాఘ మాసంలోని శుక్ల పక్షంలో  ఏకాదశి  వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అంటారు.  ఈ ఏడాది జయ ఏకాదశి జనవరి 29 వ తేది వచ్చింది.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజు ఎట్టి పరిస్థితిలో కొన్నిపనులకు దూరంగా ఉండాలి.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..!

సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మాఘమాసం శుక్ష పక్షంలో వచ్చే జయ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల విష్ణువు నుంచి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి, అయితే, ఈ ఉపవాసంలో ఒక చిన్న పొరపాటుచేసినా.. మొత్తం ఫలాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ రోజున కొన్ని తప్పులను నివారించాలి.

అన్ని ఏకాదశి ఉపవాసాలు కూడా మహా విష్ణువుకు అంకితం చేయబడినవే. హిందూ విశ్వాసాల ప్రకారం.. జయ ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం వల్ల విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. శ్రేయస్సుతో కూడిన జీవితానికి దారితీస్తుంది. అంతేగాక, జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించేవారికి మరణానంతరం జీవితం ఉండదని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

జయ ఏకాదశి ఎప్పుడు?

పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి జనవరి 28న సాయంత్రం 4:35 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి తిథి జనవరి 29న మధ్యాహ్నం 1:55 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, ఉదయించే తేదీ ప్రకారం.. ఈ సంవత్సరం జయ ఏకాదశి ఉపవాసం జనవరి 29న పాటించడం జరుగుతుంది.


జయ ఏకాదశి నాడు ఈ తప్పులు చేయొద్దు

  • ఏకాదశి ఉపవాస సమయంలో అన్నం, బియ్యంతో చేసిన పదార్థాలు తినరాదు. కాబట్టి, జయ ఏకాదశి నాడు బియ్యం లేదా దానితో తయారు చేసిన ఏదైనా తినకండి. అలా చేయడం వల్ల విష్ణువుకు కోపం వస్తుంది. ఇలా చేయడం వలన  ఉపవాసం  ప్రయోజనాలు శూన్యం అవుతాయి.
  • ఉపవాసాలను సాత్వికంగా పరిగణిస్తారు. ఉపవాస సమయంలో సాత్విక ఆహారాలు తీసుకుంటారు. కాబట్టి జయ ఏకాదశి ఉపవాస సమయంలో వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం వంటి వాటిని తినకుండా ఉండాలి. అలా చేయడం వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుంది.
  • జయ ఏకాదశి రోజున నల్ల రంగు దుస్తులను ధరించవద్దు. సాధ్యమైనంత వరకు నల్లరంగుకు సంబంధించినవి వాడకుండా ఉంటే చాలా మంచిది. 
  • జయ ఏకాదశి రోజున తులసి చెట్టును ఎట్టి పరిస్థితిలో తాకకూడదు.  దూరంగా ఉండి పూజ చేయాలి.  అంతేకాదు.. ఆ రోజు ఎట్టి పరిస్థితిలో తులసి చెట్టుకు నీరు పోయకూడదు.  ఆ రోజు తులసీ మాత విష్ణుమూర్తిని ధ్యానిస్తూ.. ఉపవాసం ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
  • జయ ఏకాదశి ఉపవాస సమయంలో పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించండి.
  • జయ ఏకాదశి .. జనవరి 29న  ఎవరితోనూ గొడవలు పడటం మంచిది కాదు.ఎవరిపైనా దుర్భాష వాడటం మానుకోండి.
  • ఒకవేళ ఎవరైనా మీతో అనుచితంగా ప్రవర్తించినా .. ఆరోజు మీరు చాలా శాంతంగా ఉండండి.. సహనం.. ఓర్పుతో భగవత్​ చింతనతో గడపండి. 
  • పగలు నిద్రపోవడం వల్ల వ్రత ఫలం తగ్గుతుందని నమ్ముతారు.
  • కోపం, అబద్ధాలు, వివాదాలు, హింస, జుట్టు/గోర్లు కత్తిరించుకోవడం, ఆయిల్ మసాజ్, ఇతరులను నిందించడం వంటి వాటికి దూరంగా ఉండండి
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.