AartiRavi: జయం రవి విడాకుల్లో ట్విస్ట్..నాకు తెలియకుండానే జయం రవి విడాకుల ప్రకటన

AartiRavi: జయం రవి విడాకుల్లో ట్విస్ట్..నాకు తెలియకుండానే జయం రవి విడాకుల ప్రకటన

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తి (Arthi) నుండి విడాకులు తీసుకున్నట్లు సోమవారం (సెప్టెంబర్ 9న) సడెన్గా ప్రకటించి అభిమానుల అందరికీ షాక్ ఇచ్చాడు. 15 సంవత్సరాల వివాహం తర్వాత తన భార్యతో విడిపోతున్నట్లు జయం రవి తెలుపగా..తాజాగా బుధవారం (సెప్టెంబర్ 11న) అతని భార్య ఆర్తి విడాకుల నోట్ పై స్పందించింది.

తనకు తెలియకుండానే జయం రవి విడాకులు ప్రకటించినట్లు ఆరోపిస్తూ నోట్ రిలీజ్ చేసింది. జయరాం రవి ఇచ్చిన బహిరంగ ప్రకటన చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. ఈమేరకు ఆర్తి సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ విడుదల చేయగా మరోసారి అందరికీ షాక్ ఇచ్చినట్లుగా మారింది. 

‘నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధపడ్డాను. 18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది. కొంతకాలంగా మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా. దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కలేదు. 

Also Read:-విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్

‘ఈ ప్రకటనతో నేను, నా పిల్లలు ఒక్కసారిగా షాకయ్యాం. ఇది పూర్తిగా తనకు తాను తీసుకున్న నిర్ణయం. దీనివల్ల నాకు, నా పిల్లలకు ఏమాత్రం మంచి జరగదు. ఈ విషయం నన్ను జీవితాంతం బాధ కలిగిస్తున్నప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే పబ్లిక్‌గా కామెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేసి.. నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది. తన ఇద్దరు కుమారులు ఆరవ్ మరియు అయాన్‌ల పైనే ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం. 

ఈ వార్త నా పిల్లలపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నా.ప్రస్తుతం పబ్లిక్ కామెంట్‌లకు దూరంగా ఉన్నాను. ఇన్ని రోజులుగా మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్‌, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ప్రేమే మాకు బలం. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆర్తి

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aarti Ravi (@aarti.ravi)