కోర్టులో లొంగిపోయిన జయప్రద

కోర్టులో లొంగిపోయిన జయప్రద

రాంపూర్: సినీనటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద సోమవారం ఉత్తరప్రదేశ్​లోని రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించారంటూ జయప్రదపై రాంపూర్​లో రెండు కేసులు నమోదయ్యాయి. కోర్టు ఆమెకు చాలా సార్లు సమన్లు పంపింది. కానీ, జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఏడు సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా ఆమె అటెండ్ కాలేదు. 

దీంతో రాంపూర్ కోర్టు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఫిబ్రవరి 27న జయప్రద పరారీలో ఉన్నట్టు ప్రకటించింది. సీఆర్పీసీ 82 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటూ.. డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ఒక టీంను ఏర్పాటు చేసింది. ఈ నెల 6న ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.