పింఛన్ కోసం వృద్ధురాలి కష్టాలు.. సాయం చేసిన కలెక్టర్

పింఛన్ కోసం వృద్ధురాలి కష్టాలు.. సాయం చేసిన కలెక్టర్

పింఛన్ కోసం రెండు సంవత్సరాలు ఆఫీసుల చుట్టు తిరిగిన వృద్ధురాలు
ఒక్క ఫోన్ కాల్ తో పించన్ ఇప్పించిన కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి: పింఛన్‌రాక ప్రభుత్వ ఆపీసుల చుట్టూ తిరుగుతున్న ఓ వృద్ధురాలికి అప్పటికప్పుడు పింఛన్ వచ్చేలా చేశారు ఓ కలెక్టర్. జయశంకర్ భూపాలపల్లి మండలం గుర్రం పల్లి గ్రామానికి చెందిన గిరిజన వృద్ధ మహిళ అజ్మీర మంగమ్మ (70) రెండు సంవత్సరాలుగా పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో భాగంగా… బుధవారం కలెక్టర్ ఆఫీసుకు వచ్చి మెట్లపై కూర్చుంది.  పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యేగండ్రా వెంకటరమణా రెడ్డిలతో కలిసి కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తన కార్యాలయానికి వచ్చారు. దీంతో ఆ మహిళను గమనించిన కలెక్టర్ ఎందుకు ఇక్కడ కూర్చున్నావని ప్రశ్నించగా రెండు సంవత్సరాలుగా పించన్ రావడంలేదని చెప్పింది. వెంటనే స్పందించిన కలెక్టర్..  ఆమె పక్కనే కూర్చుని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుమతితో ఫోన్ లో మాట్లాడి వృద్ధురాలికి పించన్ ను మంజూరు చేయించారు.