అవసరాలకు తగ్గట్లు విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి

అవసరాలకు తగ్గట్లు విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి

నిర్మాణ కళ 64 కళల్లో ఒకటని, అనేక అంశాల మేళవింపు అని ప్రముఖ నిర్మాత, కళాకారుడు బి. నర్సింగ రావు అన్నారు. మొయినాబాద్ లోని జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజీలో జరిగిన “కళావాహిని” బెటాలియన్ ఆఫ్ ఆర్ట్స్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల రూపొందించిన కళాఖండాలను తిలకించిన ఆయన.. జేఎన్టీయూలో బీఎఫ్ఏ చదివిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన జేబీఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ డైరెక్టర్ జె.గాయత్రిని అభినందించారు. 

కార్యక్రమానికి గౌరవ అతిధిగా జేఎన్ ఏఎఫ్ యూ  వైస్ ఛాన్సలర్ ఎన్ కవిత దరియాని రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పుస్తకాల్లో చదివిన అంశాలకే పరిమితం కాకుండా మారుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కవిత సూచించారు. ప్రతి ఒక్కరూ జీవితాంతం అభ్యాసకులుగా మారాలని అన్నారు. 

జేబీఆర్ఏఆర్సీ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు ఆర్ట్ క్యాంప్ నిర్వహించినట్లు కాలేజీ డైరెక్టర్ జె.గాయత్రి చెప్పారు. ఈ క్యాంప్ లో విద్యార్థులు నైపుణ్యం కలిగిన కళాకారుల నుంచి మెళకువలు నేర్చుకున్నారని అన్నారు. సంక్లిష్ట సమస్యలను సృజనాత్మకతతో పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం పునాది వేసిందని గాయత్రి అభిప్రాయపడ్డారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా విద్యార్థులకు హెరిటేజ్ వాక్, కల్చరల్ ప్రోగ్రామ్స్, వర్క్ షాప్స్, ఓరియెంటేషన్,  ఆర్ట్ క్యాంప్ లు ఏడాది పొడవునా నిర్వహించినట్లు చెప్పారు.