ప్రజాప్రతినిధులకు ఆఫీసర్లు సహకరించాలి

ప్రజాప్రతినిధులకు ఆఫీసర్లు సహకరించాలి

వనపర్తి, వెలుగు: గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చే విషయంలో ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులు సహకరించాలని జడ్పీ చైర్మన్  లోక్ నాథ్  రెడ్డి కోరారు. గురువారం జడ్పీ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్​ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్​ మాట్లాడుతూ కొందరు ఆఫీసర్లు ఫోన్ లు ఎత్తకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. 

తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం తదితర అంశాల్లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంటల సమయంలో కోతలు విధిస్తే  రైతులు నష్టపోతారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు  రుణమాఫీ జరగక పోవడానికి గల కారణాలను వివరించాలని కోరారు. ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్  నియామకాల్లో స్థానికులకే  ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు. 

ఘనపూర్  పీహెచ్​సీలో పాము కాటు మందు అందుబాటులో లేదని అక్కడి జడ్పీటీసీ సామ్య నాయక్  సమావేశం దృష్టికి తెచ్చారు. అడిషనల్  కలెక్టర్  ఎస్. తిరుపతి రావు, ఇన్​చార్జి జడ్పీ సీఈవో నర్సింహులు, జడ్పీ  వైస్  చైర్మన్  వామన్ గౌడ్  పాల్గొన్నారు.