కెమికల్ రియాక్షన్తో మంటలు?...జీడిమెట్లలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కమ్ముకున్న దట్టమైన పొగ

కెమికల్ రియాక్షన్తో మంటలు?...జీడిమెట్లలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కమ్ముకున్న దట్టమైన పొగ
  •     ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్​ఎస్టేట్​లో ఓ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇండస్ట్రియల్​ఎస్టేట్​లోని వసంత్​కెమికల్​ఫ్యాక్టరీలోని పాత రియాక్టర్లతోపాటు చెత్తాచెదారాన్ని రోడ్డు పక్కన పడేశారు. మంగళవారం ఆ చెత్త నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, ఘాటైన వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కంపెనీ సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. అవే మంటలు కెమికల్​ఫ్యాక్టరీకి అంటుకొని ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదని స్థానికులు తెలిపారు. 

ఈ కంపెనీలో  మండే స్వభావం ఉన్న ఉత్పత్తులు తయారవుతాయని, సంబంధిత వస్తువులను నిర్లక్ష్యంగా బయట పడేయడంతో కెమికల్ రియాక్షన్ జరిగి, మంటలు అంటుకున్నాయని ఆరోపించారు. పొల్యూషన్​కంట్రోల్​బోర్డు(పీసీబీ) అధికారులు స్పందించి, ఫ్యాక్టరీ వ్యర్థాల నిర్వహణపై తనిఖీలు చేపట్టి, చర్యలు తీసుకోవాలని కోరారు.