
పట్టుభద్రుల MLC అభ్యర్థిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఎంపిక చేసినట్లు TPCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకర్గం నుంచి జీవన్ రెడ్డిని బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి జీవన్ రెడ్డి పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్నా.. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆయనను పోటీలో నిలపాలని డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ ఆయనను బరిలో నిలిపింది. ఈ స్థానం కోసం కాంగ్రెస్ నుంచి చాలామంది పోటీపడగా.. అధిష్టానం జీవన్ రెడ్డికే మెగ్గుచూపింది. జీవన్‌రెడ్డి పేరును రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు ఉత్తమ్.