సీఎం ఓదార్పు ఇచ్చే స్థాయి కాదా నాది: జీవన్ రెడ్డి

సీఎం ఓదార్పు ఇచ్చే  స్థాయి  కాదా నాది: జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి అధిష్టానానికి 4 పేజీల లేఖ రాశారు.  కాంగ్రెస్ కండువా తీసి రైతు కండువా వేసుకున్న జీవన్ రెడ్డి సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఎంతమందిని తొక్కుతావ్ రేవంత్.  కాంగ్రెస్ పార్టీ నీ ఒక్కడిది అంటావా ?. సీనియర్లను గౌరవించడం నేర్చుకో రేవంత్ రెడ్డి.  అణగదొక్కబడే కంటే ఎదిరిస్తే నాకు పోయేది ఏముంది. ఎదిరిస్తా.. కొట్లాడుతా..చంద్రబాబు, కేసీఆర్ తో కొట్లాడిన ఇప్పుడు రేవంత్ తో కొట్లాడుతా.  నీ అడుగులకు మడుగులు పట్టేవాన్ని కాదు. బతుక వచ్చిన పోచారంకు సలహాదారు పదవిస్తారా.? ఎవడు ఈ వేం నరేందర్ రెడ్డి.. నువ్వు ఎవన్ని అనుగదొక్కుతావ్.  సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకుంటారా.?  పీసీసీ చీఫ్ కావాల్సిన వాణ్ని. నియోజకవర్గంలో హక్కుల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి.  పెట్టుబడి దారుల వల్ల నన్ను మోసం చేశారు . నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం నన్ను పక్కన పెట్టారు..?  మరి అక్కడ గెలిచారా..?  జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తను దారుణంగా చంపితే.. అధిష్టానం పట్టించుకోదా ?  నా అనుచరుడు గంగారెడ్డిని చంపితే.. సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఫోన్ చేయలేదు .కార్యకర్తలకు కనీసం ఓదార్పు ఉండదా ?.  నేను ఇచ్చిన నామినేటెడ్ పదవులను పెండింగ్ లో పెడతారా? మీరు  కేసీ వేణుగోపాల్ హామీని పక్కన పెట్టాక.. ఇక పార్టీ ఎందుకు..?  గాంధీ భవన్ లో ఫిరాయింపు ఎమ్మెల్యే కు సీట్ వేస్తారా ?దానం నాగేందర్ ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి.. ఎంపీ గా పోటీ చేయిస్తే అయిపోయేది కదా.  సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ సీట్లలో ఎందుకు ఓడిపోయామో అధిష్టానంకు తెలియదా? ’అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.