
బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని విమర్శించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీజేపీ పై యుద్ధమంటే… ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు పెట్టడమేనా అని కేసీఆర్ ను ప్రశ్నించారు. రైతును నిండా ముంచుతోంది సీఎం కేసీఆరే అన్నారు జీవన్ రెడ్డి. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలతో రైతులు సర్వం కోల్పోతే… ఇప్పటివరకు పంట నష్టంపై సర్వే చేయలేదన్నారు. సన్నరకం వడ్లు పండించిన రైతులకు ఎకరాకు 10వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి.