
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన హీరో నాని(Nani) తీసిన చిత్రం జెర్సీ(Jersey).2019లో రిలీజైన జెర్సీ సినిమా భారీ విజయాన్ని సాధించి,ఇప్పటివరకు అనేక అవార్డులు గెలుచుకుంది.ఒక్కో సాంగ్ చార్ట్ బ్లాస్టర్ అవ్వడంతో ఇప్పటికీ ఈ సినిమాపై హైప్ నెక్స్ట్ లెవల్లో ఉంది.
అయితే..ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో ప్రశంసలు పొందిన జెర్సీ మూవీ శనివారం (ఏప్రిల్ 20న) రీ రిలీజ్ అయింది. ఇపుడు ‘జెర్సీ’ సినిమా మళ్లీ థియేటర్లలో అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు..నాని ఫ్యాన్స్ ఈ సినిమాతో జెర్సీ ఫ్యాన్స్ గా మారారు. అయితే, ఈ మూవీ రిలీజ్ అయి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా నాని ఫ్యాన్స్ కు మరో సర్ఫ్రైజ్ ప్లాన్ చేసారు.
వివరాల్లోకి వెళితే..సుదర్శన్ 35 ఎం.ఎం లో జెర్సీ మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఏప్రిల్ 20 ఈవెనింగ్ ఆరు గంటల షోకి హీరో నాని, డైరెక్టర్ గౌతం తిన్ననూరి అండ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ రాబోతున్నారు.ప్రేక్షకులతో పాటు వారు కూడా సినిమాను చూడబోతున్నారు.ఈ విషయం తెలిసి నాని ఫ్యాన్స్ ఎంతో హ్యాపీ గా వున్నారు .తమ అభిమాన హీరోతో నచ్చిన జెర్సీ సినిమాను చూడాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
జెర్సీ 67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటర్ విభాగాల్లో రెండింటికీ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. జెర్సీకి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్ నూలి అవార్డు దక్కించుకున్నారు.ఈ మూవీ విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న చిత్రంగా నిలిచింది. రూ.25 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీకి సుమారు రూ.50 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి.
Celebrating 5 Years of our classic tale #JERSEY ?❤️
— Sithara Entertainments (@SitharaEnts) April 19, 2024
Our Natural Star @NameisNani garu, director @gowtam19 and Producer @vamsi84 will join the fans for the special celebrations at Sudarshan, TOMORROW at 6:00 PM.?#JerseySpecialShows ❤️?@anirudhofficial @ShraddhaSrinath… pic.twitter.com/lNCnUGv2GF